విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి
1 min read

ఉత్తమ విద్యకు, క్రమ శిక్షణకు కేరాఫ్ … ఎస్ఆర్ విద్యాసంస్థలు
ఎస్ ఆర్ విద్యాసంస్థల జోనల్ ఇన్చార్జ్ రఘు వీర్
రావూరి గార్డెన్లో ఘనంగా ఫ్రెషర్ డే వేడుకలు
కర్నూలు ఎడ్యుకేషన్ , న్యూస్ నేడు: క్రమశిక్షణ, పట్టుదల, ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు వస్తాయని, అందుకు ఉత్తమ, నాణ్యమైన విద్య అందించడంలో ఎస్ ఆర్ విద్యాసంస్థలు ముందుంటాయని, ఎస్ ఆర్ కాలేజి జోనల్ ఇన్ చార్జ్ రఘువీర్ అన్నారు. శుక్రవారం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్ లో విద్యార్థుల ఫ్రెషర్ డే వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జోనల్ ఇన్చార్జ్ రఘువీర్ మాట్లాడుతూ చదువులో పోటీ తత్వం ఉండాలని, అప్పుడే సాధించాలన్న తపన ఉంటుందని విద్యార్థులకు సూచించారు. ఎస్ ఆర్ విద్యాసంస్థలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు. ఫ్యాకల్టీ టీచర్స్, సిబ్బంది కృషి వల్ల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని , అందుకే విద్యార్థుల తల్లిదండ్రుల ఆదరాభిమానం చూరగొన్నామని ఈ సందర్భంగా జోనల్ ఇన్చార్జ్ రఘువీర్ స్పష్టం చేశారు. అనంతరం డీన్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల చదువు కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతూ.. ఆశల పెట్టుకొని ఉంటారని, వారి ఆశను నెరవేర్చాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో అత్యుత్తమ మార్కులు సాధించిన సిరిమేష్ ( 461/ 470) , షమీ (461/470 ); శివ శంకర్ 461/470); బైపీసీ లో (435/440 ) సహస్ర్తను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రవీంద్ర, ఏజీఎం సలీమ్, అకౌంట్ ఆఫీసర్ పాల్గొన్నారు. అనంతరం విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఆ తరువాత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.


