మండలంలో వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
1 min read

చెన్నూరు , న్యూస్ నేడు : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను కడప ఊటుకూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ జి ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ కే సునీల్ కుమార్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సి యాస్మిన్ లు శుక్రవారం పర్యటించి పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా మండలంలోని ఓబులంపల్లి, గుర్రంపాడు గ్రామాల పరిధిలో సాగుచేసిన వరి పంటలను వారు పరిశీలించారు. వర్షాలకు పూర్తిగా పడిపోయిన వరికి మొలకలు రాకుండా నివారించేందుకు రైతులు 50 గ్రాముల ఉప్పును తీసుకుని లీటర్ నీటితో కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు. అలాగే నల్ల గింజ తెగులు, పొట్ట కుళ్ళు మామిడి తెగులు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎకరాకు ప్రాపికోనోజల్ 200 మిల్లీలీటర్లు, లేదా షేక్స కోనోజెల్ 400 మిల్లీలీటర్లు పిచికారి చేసుకోవాలని రైతులకు సూచించారు. వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి దోమపోటు ఉధృతి ఎక్కువగా ఉన్నదని ఈ దోమ నివారణకు పై మెట్రోజెన్ 120 గ్రాములు లేదా డైనోటెవ్యూ రన్ 80 గ్రాములు ఎకరాకు నీటితో కలిపి పిచికారి చేయాలని శాస్త్రవేత్తలు రైతులకు తెలపడం జరిగింది. వర్షాల వల్ల దెబ్బతిన్న వరి పంటలకు సంబంధించి నష్ట పరిహారం ఇప్పించేందుకు శాస్త్రవేత్తలు కృషి చేయాలని పలువురు రైతులు కోరగా ఈ సమస్యలన్నీ కూడా ఉన్నత అధికారులకు తెలియజేస్తామని శాస్త్రవేత్తలు రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కే శ్రీదేవి, ఓబులంపల్లె వి ఏ ఏ సునీల్ సునీల్ కుమార్ , ఆదర్శ రైతులు, మండల రైతులు పాల్గొన్నారు.

