NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘోర బస్సు దుర్ఘటన బాధితులకు  ఉచిత న్యాయ సేవ

1 min read

కర్నూలు, న్యూస్ నేడు:  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ  చైర్మన్ మరియు జిల్లా జడ్జి శ్రీ జి. కబర్థి  సూచనల మేరకు కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి  శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కర్నూల్ నందు చిన్న టేకుర్ గ్రామం సమీపంలో జరిగిన ఘోర  బస్సు దుర్ఘటనకు గురైన బాధితులు వారి కుటుంబ సభ్యులకు మరియు బంధువులకు న్యాయ సంబంధమైన సలహాలు, ఉచిత న్యాయ సహాయము, నష్టపరిహారం మరియు ఇతర సమస్యలు పరిష్కరించడం కొరకు ఉచిత న్యాయ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కార్యదర్శి  బి. లీల వెంకట శేషాద్రి తెలిపా రు. బాధితులకు ఎవరికైనా న్యాయ సహాయం కావాలంటే నేరుగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థను గాని లేదా   టోల్ ఫ్రీ నెంబర్. 15100 కైనా ఫోన్ చేసి వారి సమస్యను తెలుపు కోవచ్చని తెలిపారు. న్యాయ సేవ అధికార సంస్థ ప్యార లీగల్ వాలంటర్స్ సాయి ప్రదీప్ మొదలగు వారు బస్సు దుర్ఘటనలో గాయపడి వారిని ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించడం కృషి చేస్తున్నారని తెలిపారు. గాయపడిన లేదా చనిపోయిన వారి బంధువులకు దగ్గరుండి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు.

About Author