7,10,836 రూ.ల సీఎంఆర్ఎఫ్ పంపిణీ..
1 min read

ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే జయసూర్య..
నందికొట్కూరు, న్యూస్ నేడు: ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో 9 మందికి మొత్తం 7 లక్షల 10 వేల 836 రూ.ల చెక్కులను వివిధ కాలనీలకు వెళ్లి శనివారం మధ్యాహ్నం పంపిణీ చేశారు.పట్టణంలోని సాయిబాబా పేట,కురువపేట, సంగయ్య పేట,కుమ్మరి పేట, సూర్యానగర్,రామాలయం వీధి,విద్యా నగర్,ఏబీఎం పాలెంకు చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారుల వివరాలు:కుమ్మరి రవణమ్మకు-45 వేలు,పఠాన్ హుశేన్ బి కి 1,10 వేలు రూ.లు,3.షేక్ హబీబ్ బాషకు 95,366 రూ.లు,4.కుమ్మరి తిక్కన్నకు- 30,556రూ.లు,5.వడగండ్ల వినీతకు- 24 వేలు,6.చిలుకూరి సునీత-81 వేలు, 7.బొల్లెద్దుల నీరజ-63,006 రూ.లు,8.షేక్ కరీముల్లా బేగ్-89,761 రూ.లు,9.కురువ వరాలమ్మా-1,72,147 రూ.ల మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే జయసూర్య పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,పట్టణ కన్వీనర్ భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్ జాకీర్,కడియం వెంకటేశ్వర్లు,కాతా రమేష్ రెడ్డి,సొసైటీ చైర్మన్ ముర్తు జావాలి,క్లస్టర్ ఇంచార్జ్ మద్దిలేటి,షకీల్ అహ్మద్, శివశంకరయ్య,వేణుగోపాల్, శ్రీకాంత్ గౌడ్,కళాకార్, కౌన్సిలర్ చిన్న రాజు, నిమ్మకాయల మోహన్, నిమ్మకాయల రాజు,బ్రహ్మం పాల్గొన్నారు.

