మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
1 min read

పత్తికొండ , న్యూస్ నేడు: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పత్తికొండలో పట్టణంలోని యశోద టవర్స్ 17వ వార్డులో మంగళవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులతో కలసి కాలనీ లో ప్రతి ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడుతూ, — “ప్రభుత్వ వైద్య కళాశాలలు పేద మరియు మధ్యతరగతి విద్యార్థుల ఆశలకు నిలయాలని, వాటిని ప్రైవేటీకరించడం అంటే పేదల విద్యా, వైద్య హక్కును దోపిడీ చేయడమే అవుతుందని మాజీ ఎమ్మెల్యే అన్నారు.ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణం వెనక్కి తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వైద్య రంగంలో ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలను కాపాడటానికి, ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు లభించేలా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అనుబంధ కమిటీ సభ్యులు, ఎంపీపీ, మండల కన్వీనర్, జిల్లా కమిటీ నాయకులు, సర్పంచులు, ఎంపిటిసిలు, పత్తికొండ పట్టణ ఎంపిటిసిలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వార్డు మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతకాల సేకరణలో భాగస్వాములు అయ్యారు.


