పోలీసు అమరవీరుల వారోత్సవాలు..
1 min read

పోలీసు సిబ్బంది సంక్షేమమే ముఖ్యం…
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ప్రారంభించిన … కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
కర్నూలు, న్యూస్ నేడు: అమరవీరుల త్యాగాలను , సేవలను ప్రజలకు, సమాజానికి తెలియజేయాలి.పోలీసు సిబ్బంది సంక్షేమమే ముఖ్యమని , ప్రతి ఒక్క పోలీసు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలోని మిని కాన్ఫరెన్స్ హాల్ లో ఉచిత మెగా వైద్య శిబిరం, వ్యాస్ ఆడిటోరియం కు ఎదురుగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలలో జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత మెగా మెడికల్ క్యాంపును, మెగా రక్తదాన శిబిరం లను ప్రారంభించారు. కర్నూలు కొత్తబస్తాండు దగ్గర ఉన్న జెమ్ కేర్ కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు , కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 182 మంది పోలీసు సిబ్బంది , పోలీసు కుటుంబాల వారు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారికి డాక్టర్లు తగిన సూచనలు, సలహాలు తెలియజేశారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ మాట్లాడుతూ… ఆరోగ్య సమస్యలుంటే ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్య పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.పోలీసు అధికారులు , సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే వారు తమ విధులను బాగా నిర్వహించవచ్చన్నారు. అమరవీరుల వారోత్సవాలలో మెడికల్ క్యాంపు నిర్వహించిన కర్నూలు జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ వైద్యుల బృందాన్ని అభినందిస్తున్నామన్నారు. ప్రజలకు, సమజానికి అమరవీరుల త్యాగాల సేవలను తెలియజేయాలన్నారు. మెగా రక్తాదాన శిబిరంలో పోలీసులు, యువకులు కలిసి 110 మంది రక్తదానం చేశారు. రక్తదానం చేసిన బ్లడ్ ప్యాకెట్స్ ను కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంకు కు అందజేశారు. ఈకార్యక్రమంలో సదరన్ రిజియన్ హోంగార్డు కమాడెంట్ శ్రీ యం. మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీలు శ్రీ హుస్సేన్ పీరా , ఎస్పీ కృష్ణమోహన్ , పోలీసు వేల్పేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి , గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ రంగస్వామి, జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ జనరల్ మేనేజర్ నదీమ్, డాక్టర్లు బాల మురళీ క్రిష్ణ, శ్రుతి , రవిబాబు, రాఘవేంద్ర, రామ్ మోహన్ రెడ్డి, ఆర్ ఐలు , ఆర్ ఎస్సైలు , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


