హేలాపురి ఘన చరిత్రకు తార్కాణంగా తూర్పు వీధి గంగానమ్మ అమ్మవారి జాతర
1 min read

సంబర అమ్మవారి జాతరమహోత్సవాలు
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే దంపతులు,మేయర్ దంపతులు
ఏలూరుజిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: హేలాపురి ఘన చరిత్రకు తార్కాణంగా నిలిచే తూర్పువీధి గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి అంకురార్పణ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏలూరు తూర్పువీధిలో వేంచేసియున్న శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ పోతురాజుబాబుల జాతర మహోత్సవానికి అంకురార్పణగా ముడుపు కట్టే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మీనా దంపతులు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నగర మేయర్ షేక్ నూర్జహాన్లు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్టీసి విజయవాడ జోన్ – 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు,ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్ మమిళ్ళపల్లి పార్ధసారధి, కో – ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, కార్పొరేటర్ కర్రీ శ్రీనివాస్, మాజీ ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ మరియు వేలాదిమంది భక్తులు,వివిధ హోదాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


