NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లే రోడ్డు కనిపించట్లేదా…?

1 min read

కనిపించినా….కనిపించనట్టు వ్యవహరిస్తున్నారా…??

స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులు ఫైర్….

హొళగుంద న్యూస్ నేడు హొళగుంద : మండలం కోగిలతోట గ్రామంలో స్థానిక బస్టాండు నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు ఉన్న రోడ్డంతా గుంతలమయం… వర్షం వస్తే చాలు అంతా బురదమయం.. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఆ రోడ్డును చూసి పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి.. గుంతలమయం, బురదమయంతో నిండిపోయిన ఆ రోడ్డు పంచాయతీ కార్యదర్శికి, పాలకులకు కనిపించట్లేదా….???? పాఠశాలకు వెళ్లే దారికి సీసీ రోడ్డు వేయకపోలేదు సరే…. కనీసం మరమ్మత్తులు కూడా చేయించలేరా..?? వర్షాలు కురిసిన  బురద మయంతో, గుంతల మయమైన దారిలో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతూ, పాఠశాలకు వెళ్లే పరిస్థితి.. ఇలాంటి రోడ్ల పైన అధికారులు గానీ పాలకులు గానీ ఎందుకు దృష్టిసారించడం లేదు..?? ఇలాంటి దారి మీదుగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సిందేనా..?? ఇలాంటి రోడ్డుకు  పాలకులు లేదా అధికారులు మరమ్మత్తులు చేపట్టి… మోక్షం  కలిగించేది ఎన్నడు…?? పాఠశాలకు వెళ్లే  విద్యార్థులకు ఈ దారిని వెంటనే మరమ్మతులు చేయించి విద్యార్థుల విద్యాభ్యాసానికి కృషి చేయాలని కోగిలతోట గ్రామ ఎమ్మార్పీఎస్ నాయకులు కే గోవర్ధన్,ఇటీగాల్ వీరేష్, డిమాండ్ చేశారు.

About Author