నాబార్డ్ సేవలను ఉపయోగించుకొని రైతుల జీవనోపాధిని మెరుగుపరుచుకోవాలి
1 min read

డీసీఎంఎస్ చైర్మన్ మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై. నాగేశ్వరరావు యాదవ్
ప్యాపిలి, న్యూస్ నేడు: డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలంలో సొసైటీ ఫర్ రూరల్ అండ్ ఎకో డెవలప్మెంట్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ దామోదర్ రెడ్డి మరియు ప్యాపిలి సింగిల్ విండో సొసైటీ సీఈఓ ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వై.నాగేశ్వరావు యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశీస్సులతో నాబార్డు సేవల ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాక్షరత ద్వారా భారత ప్రభుత్వం వారి సాంఘిక భద్రత పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించుట కొరకు స్వచ్ఛంద సేవా సంస్థలకు ఈ బాధ్యత అప్పజెప్పడం జరిగింది. స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, సుకన్య సమృద్ధి పథకము, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మరియు అటల్ పెన్షన్ యోజన పథకాలను వినియోగించుకుని రైతులు ప్రకృతి వైపరీత్యాల వలన తెగుళ్లు మరియు ఇతర వ్యాధుల వలన నమోదు కాబడిన పంటలకు ఫసల్ బీమాయో సౌకర్యం ద్వారా నష్టపోయిన రైతులకు ఆర్థిక చేయూత కల్పిస్తారు అలాగే నూతన వ్యవసాయ పద్ధతులు ప్రోత్సాహం ద్వారా వారి ఆదాయ స్థిరీకరణకు పంట నష్టం జరగినప్పుడు విస్తృత ప్రయోజనాల పంట బీమా పథకాన్ని అమలు చేయుటకు ఉపయోగపడుతుంది. ఆర్థిక మరియు అక్షర సాంకేతిక అక్షరాస్యత కార్యక్రమంలో నాబార్డ్ వారి ద్వారా రైతులకు వ్యవసాయ రుణాలు, క్రాఫ్ట్ లోన్లు, అకౌంట్ హోల్డర్స్ కి సంవత్సరానికి 330 రూపాయలు కడితే నాలుగు లక్షల ఇన్సూరెన్స్ అందించడం జరుగుతుంది. అలాగే పశువులకు 300 ఇన్సూరెన్స్ కడితే, మూడు సంవత్సరాలలో పశువులకు ఏదైనా హాని జరిగి చనిపోతే ఒక పశువుకు 15000/- చెల్లించడం జరుగుతుంది. ఊరి ప్రజలు ఒక స్థలాన్ని కేటాయిస్తే వారి పశువులకు, రైతులు పంటలు అమ్ముకోవడానికి నాబార్డ్ సంస్థ వారు ఒక షెడ్డు ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క రైతు ఈ సేవలను వినియోగించుకొని వారి జీవనోపాధిని మెరుగుపరచుకుంటారని తెలియజేశారు. అనంతరం కొన్ని కారణాలవల్ల ఇంకా పెన్షన్ తీసుకుని వారికి ఎన్టీఆర్ భరోసా ఫించను పంపిణీ చేశారు. ఈకార్యక్రమం లో ప్యాపిలి సింగల్ విండో సొసైటీ డైరెక్టర్ రవీంద్ర , పిఆర్ పల్లె నాయకులు ఎంపిటిసి నెంబరు శ్రీరాములు, మాజీ సర్పంచ్ నాగేశ్వరావు, రామాంజనేయులు, పల్లె జయరామిరెడ్డి , అల్లె శ్రీరామ్ రెడ్డి, ప్యాపిలి మండల నాయకులు గొల్ల రామ్మోహన్, జక్కసానిగుంట్ల మహేష్, పోదొడ్డి పుల్లారెడ్డి ,రాంపురం నాగేశ్వరరావు , జక్కసానిగుంట్ల ఆదిరెడ్డి, జానకి రాము, నాగేంద్ర, రాంపురం రమేష్, గుడిపాడు శంకర్,పిఆర్ పల్లె గ్రామ నాయకులు, రైతులు మరియు ప్రజలు పాల్గొన్నారు.


