శ్రీ శ్రీ భక్త కనకదాసు 538వ జయంతి ఘనంగా నిర్వహించుకోవాలి
1 min read

హొళగుంద న్యూస్ నేడు: హొళగుందమండల కేంద్రంలో శ్రీ శ్రీ భక్త కనకదాస్ 538వ జయంతి సందరబంగా ఆలూరు నియోజక వర్గ అన్ని గ్రామాల్లో శనివారం జరుగబోయి శ్రీ శ్రీ భక్త కనకదాసు జయంతిని మాదాసి మాదారి కురువ కులస్తులందరూ ఐక్యంగా కలిసిమెలిసి ఘనంగా కనకదా జయంతిని జరుపుకోవాలని హొళగుంద మండలం గౌరవాధ్యక్షులు కాలిక ప్రసాద్ తెలిపారు. గౌరవాధ్యక్షుడు కాలికి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 538 వ జయంతి జరుపుకోవడానికి ప్రత్యేక జీవ విడుదల చేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని విద్య సంస్థలలో అన్ని సచివాలయాల్లో కనకదా జయంతి నిర్వహించే విధంగా ప్రభుత్వం జీవో విడుదల చేయాలనీ కోరుచున్నాము, ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎస్కే గిరి,మాధసి కురువ సంగం ఆలూరు తాలూకా ప్రధాన కార్యదర్శి పెద్దహ్యట మల్లయ్య, గాదిలింగప్ప,వీరభద్రప్ప,మల్లికార్జున,ముద్దటమాగి, ఆనంద్,వీరేష్, పాల్గొన్నారు.

