NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాలో బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీ

1 min read

కర్నూలు, న్యూస్ నేడు:  కర్నూలు జిల్లా స్థాయి ఇన్స్పెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీ కార్యక్రమం లో భాగంగా  నేడు జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమీర్ ఆదేశాల మేరకు  సి. క్యాంప్ సెంటర్లో ఉన్న  శిశు గృహ ప్రత్యేక బాలల  దత్తత కేంద్రాన్ని  మరియు  మెర్సీ హోం -మరియా నిలయం లను పరిశీలించారు. ఈ తనిఖీలో జిల్లా బాలల సంరక్షణ అధికారి టి. శారద, జువెనైల్ జస్టిస్ బోర్డ్ సభ్యురాలు ఎస్. మాధవి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు కె. మధు సుధాకర్, ఎన్జీవో లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, తాండ్రపాడు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంజుష,  సైకాలజిస్ట్ డాక్టర్ కే. చంద్రశేఖర్ పాల్గొన్నారు.నందికొట్కూరు రోడ్ లో ఉన్న మెర్సీ హోం, మరియు శిశు గృహ  పిల్లలకు అందిస్తున్న ఆహారం, నివాసం, విద్య, ఆరోగ్య సేవలు మరియు మానసిక స్థితిగతులను కమిటీ సభ్యులు పరిశీలించారు. సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై కూడా సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా శిశు గృహ మేనేజర్ మెహతాజ్, మెర్సి హోమ్ సిస్టర్స్ మేరీ సిరి, సారంగా ,  పద్మ తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు పిల్లల సంక్షేమం, భద్రత, సదుపాయాల మెరుగుదలపై తగిన సూచనలు ఇచ్చారు.

About Author