NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వ్యాసరచన పోటీలో జిల్లాలో ప్రథమ స్థానంలో భాష్యం విద్యార్థులు

1 min read

ఎమ్మిగనూరు న్యూస్ నేడు:  ఎమ్మిగనూరు పట్టణంలో పోలీస్ శాఖ వారు “మహిళలు మరియు పిల్లలపై లైంగిక దుర్వినియోగం నుండి రక్షించుకోవడంలో విద్యార్థుల పాత్ర” అనే అంశంపై పోలీస్ శాఖ వారు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో ఎమ్మిగనూరు భాష్యం విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మహిళలు పిల్లల భద్రతపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. 9వ తరగతి చదువుతున్న ఆనియ మెహక్ జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. బుధవారం వ్యాసరచన పోటీల్లో ప్రతిభా కనబరిచిన విద్యార్థిని విద్యార్థులను పట్టణంలోని సిఐ శ్రీనివాసులు మరియు ఎస్ఐ మధుసూదన్ రెడ్డి లు  సర్టిఫికెట్ను అందచేస్తూ, అభినందించారు. అదేవిధంగా సిఐ వి.శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ చాలా ముఖ్యమని నేటి బాలులే రేపటి పౌరులని అన్నారు. అదేవిధంగా భాష్యం జెడ్ఈవో మాచాని కవిత  మాట్లాడుతూ పిల్లలకు ఇలాంటి వ్యాసరచన పోటీలు పెట్టి విద్యార్థులను అభినందించినందుకు చాలా కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో  ప్రిన్సిపల్ నాగరాజ్, హెచ్ఎం అనురాధ, వైస్ ప్రిన్సిపల్ ఖాసిం,  ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది.

About Author