ఎమ్మెల్యే హెచ్చరించినా మారని తీరు..
1 min read

స్కానింగ్ చేయడం లేదని గర్భవతులు ఆవేదన..
నందికొట్కూరు, న్యూస్ నేడు: మేము గర్భవతులం గర్భంలో పిండం సరిగ్గా ఉందో లేదోనని స్కానింగ్ కొరకు మిడుతూరు సిహెచ్ సీ(సామాజిక ఆరోగ్య కేంద్రం)ఆస్పత్రికి వెళ్తే మాకు స్కానింగ్ చేయడం లేదు ఇక్కడ చేయం బయట హాస్పిటల్లోకి వెళ్లి చేయించు కోండంటూ డాక్టర్ అంటూ ఉన్నారని గర్భవతులు తమ ఆవేదనను వెళ్ళగక్కారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని వివిధ గ్రామాల గర్భవతులు ముస్కాన్, మౌలాబి,సబియా,ఆస్మా,ఖైరుణ్ బి,ఫాతిమాభి,సమీనా తదితర గర్భవతులు డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య స్థానిక ఆసుపత్రిలో గత నెలలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్వయంగా స్కానింగ్ చేయడం లేదని మహిళలు విన్నవించారు.ఇలా ఎందుకు చేస్తున్నారని సమావేశంలోనే డాక్టర్లపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.మేము ఎంతో వ్యయ ప్రయాసాలు పడి ఆసుపత్రికి వెళ్తే 3,4,5,6 నెలల అగర్భవతులకు స్కానింగ్ చేయం..7,8,9 నెలల వారికి మాత్రమే స్కానింగ్ చేస్తామని అంటున్నారని ఇప్పటికైనా స్పందించి స్కానింగ్ చేసే విధంగా చూడాలని వివిధ గ్రామాల మహిళలు కోరుతున్నారు.


