కార్తీకమాసం సందర్భంగా శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న భక్తులు
1 min read

లక్ష తమలపాకులతో వేద పండితులతో లక్షర్చన కార్యక్రమం
వివిధ సేవలు రూపేణ రూ:1,99,154/-లు ఆదాయం సమకూరినది
కార్యనిర్వహణాధికారిని ఆర్.వి చందన
సుమారు1,651 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా,జంగారెడ్డిగూడెం మండలం, గురవాయిగూడెం గ్రామములొ వేంచేసియున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానము నందు కార్తికమాస మహోత్సవములు సందర్భముగాబుధవారం ఉదయం గం.09.00 లకు శ్రీ స్వామి వారికి లక్ష తమలపాకులతో లక్షార్చన ఆలయ అర్చకులు, వేద పండితులు, ఋత్వికులుచే అత్యంత వైభవముగా జరుపబడినది. ఈ కార్యక్రమములో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనరు. బుధవారం మద్యాహ్నం గం.05.00 ల వరకు స్వామి వారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణా రూ.1,99,154/-లు సమకూరినది. ఈ రోజు శ్రీ స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 1651 భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ జరుపబడినది. శ్రీ స్వామి వారి దేవస్థానము నందు ప్రతి శనివారము పంచామృత అభిషేకములు, ప్రతి ఆదివారము హనుమద్ హోమము అనంతరం శ్రీ సువర్చుల హనుమద్ కళ్యాణము ప్రతి సోమవారము లక్ష తమలపాకుల పూజ, ప్రతీ బుధవారం లక్ష పుష్పార్చన జరుగునని, ఈ పూజా కార్యక్రమములో పాల్గొనదలచినవారు దేవస్థానం నందు సంప్రదించవలసినదిగా ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెల్పినారు.

