NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ కో-ఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవం

1 min read

అధ్యక్ష,కార్యదర్శులుగా యర్రా  ఏసు, షేక్ నజీర్

 శుభాకాంక్షలు తెలిపిన ఎన్జీవోస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ కో-ఓపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు ఎన్నికల అధికారి గా వ్యవహరించిన డి.రాజా రత్నం ప్రకటించారు.సహాయ ఎన్నికల అధికారిగా కె.సురేష్ బాబు,,పరిశీలకులు గా వి.వెంకట నారాయణ ఎన్నికల ప్రక్రియని జరిపించారు.ఏలూరు జిల్లా అధ్యక్షుడు గా యర్రా ఏసు ఈసు కుమార్, సహధ్యక్షుడు కె. నరసింహ మూర్తి.ఉపాధ్యక్షులు గా ఆర్.కిరణ్ కుమార్ సెక్రటరీ గా షేక్ నజీర్. జాయింట్ సెక్రటరీ గా టి. వినయ్ కుమార్. జాయింట్ సెక్రటరీ (విమెన్) గా జి.శాంత కుమారి. కోశాధికారిగా బి. ప్రభాకర రావు..క్యాడర్ సెక్రటరీ గా కె. వి.సోమేశ్వర రావు, సి హెచ్.మంగ తాయారు,కార్యవర్గ సభ్యులు గా 11.11.2025 నుంచి 10.11.2028 వరకు మూడు సంవత్సరాలు పాటు ఈ కమిటీ ఉంటుందని,తదనంతరం నూతన కార్యవర్గం తో ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమంలో కో- ఓపరేటివ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్స్ పెన్మత్స శివ నాగ రాజు మన్నే బాబు,లక్ష్మణ రావులు.జిల్లా ఎన్జీజివోస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు,రాష్ట్ర జె ఏ సి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఆర్.ఎస్.హరనాధ్ లు పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు.

About Author