NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తూకాల్లో తేడాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం

1 min read

తూనికల కొలతల శాఖ ఇన్స్పెక్టర్ నాగరాజు

రెండు రోజులు విస్తృతంగా తూనికలు కొలతల శాఖ అధికారుల తనిఖీలు

ఐదు కేసులు నమోదు 18వేలు అపరాధ రుసుము జరిమానా

షాపు లకు తాళాలు వేసుకుని జారుకున్న షాపు యజమానులు

తాళాలు వేసుకుని వెళ్లిన వారిని ఎవరిని వదిలి పెట్టే ప్రసక్తి లేదు

ప్యాపిలి న్యూస్ నేడు: తూకాల్లో తేడాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తూనికల కొలతల శాఖ ఇన్స్పెక్టర్ నాగరాజు  హెచ్చరించారు.ప్యాపిలి పట్టణంలోని పలు దుకాణాల్లో తూనికల కొలతల శాఖ అధికారులు బుధవారం,గురు వారం రెండు  రోజులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తూనికల కొలతల శాఖ జిల్లా ఇన్స్‌పెక్టర్‌ నాగరాజు  కిరాణ దుకాణాలు, బేకరీ లు, చికెన్ సెంటర్లు, ప్లైవుడ్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు డిజిటల్‌ తూకాలు, బాట్లు పరిశీలించారు. విషయం తెలుసుకున్న మిగతా దుకాణదారులు తమ షాపుల యజమనులు షెటర్లకు తాళాలు వేసి జారుకున్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ బుధవారం రెండు, గురువారం ఐదు షాపుల్లో తూకాలు తేడా వచ్చాయని, వాటి లో ఐదు  దుకాణాలకు 18వేలు అపరాధ రుసుము జరిమానా విధించామని, ప్రస్తుతం దుకాణాలకు తాళాలు వేసుకుని వెళ్లిన వారిని ఎవరిని వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. ఇకపై తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. తూకాల్లో తేడాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చ రించారు. వారి వెంట సిబ్బంది ఉన్నారు.

About Author