NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే ను పరిశీలన

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: అధికారుల ఆదేశాల మేరకు   ప్యాపిలి పట్టణంలోని 4 వ సచివాలయం లో కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే ను పరిశీలించినట్లు  డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాఘవేంద్ర గౌడు, పర్యవేక్షకుడు మనోహర్ రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటిని సందర్చించి చర్మ వ్యాదుల ను,శరీరం పైన స్పర్శ లేని రాగి రంగు లో ఉండే మచ్చలు, బొడపలు, కాళ్ళు, చేతులకు తిమ్మిర్లు, మానని పుండ్లు ఉంటే గుర్తించి ప్రాతమిక ఆరోగ్య కేంద్రం కు రెఫెర్ చేయలేదన్నారు.కుష్ఠు అనుమానిత కేసు ను పరిశీలించి రెఫెర్ చేశామన్నారు. ప్రాథమిక స్తాయి లో గుర్తించి నిర్ధారణ అయితే పి బీ కి 6 నెలలు, ఎం బీ కి 12 నెలలు బహుళ ఔషాద చికిత్స తీసుకొంటే కుష్ఠు వ్యాధి పూర్తిగా నయము అవుతుంది అని, కుష్ఠు వ్యాధి లేని సమాజం ను చూడాలని ప్రజలకు అవగాహనా కల్పించారు. ఎన్ సి డీ సర్వే ను కూడా పరిశీలించి ప్రతి రోజు 15 ఇండ్లను నాణ్యతతో కూడిన సర్వే చేయవలెనని తెలపారు.ఈ కార్యక్రమంలో ఎం ఎల్ ఎచ్ పి మల్లేశ్వరమ్మ, ఏ ఎన్ ఎం శోభా, ఆశ కార్యకర్త రామలక్ష్మి, ప్రజలు పాల్గొన్నారు.

About Author