NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డిజిటల్ గ్రంధాలయల వినియోగంపై ఓరియంటేషన్

1 min read

పెదపాడు శాఖ గ్రంధాలయంలో ముగింపు వారోత్సవాలు

ఏలూరు, న్యూస్​ నేడు:  58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ముగింపు వేడుకలు ఈరోజు గురువారం ఉదయం 11 గంటలకు పెదపాడు శాఖా గ్రంధాలయం నందు ముందుగా విద్యార్థిని, విద్యార్థులచే  “డిజిటల్ గ్రంథాలయాల వినియోగంపై ఓరియంటేషన్” “స్వీయ పఠనం” కార్యక్రమం నిర్వహించబడినది. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు సభ బహుమతుల ప్రధాన ఉత్సవమునకు ముఖ్య అతిథులుగా పెదపాడు జడ్. పి.హెచ్ స్కూల్ హెచ్ మ్  పి. వెంకటేశ్వరరావు, జూనియర్ కాలేజీ ఎకనామిక్స్ లెక్చరర్ బి.ప్రమీల,పెదపాడు మండల మానవతా కన్వీనర్ కె.ఎస్. రామకృష్ణ,మానవతా అధ్యక్షులు వి.ప్రసాద్ ఎం.పీ.పీ స్కూల్ హెచ్.మ్ పి. అంజనాదేవి, శ్రీకృష్ణ గురుకులం పాఠశాల హెచ్.మ్ ఆర్ బెంజిమెన్, సెంట్ అగస్టీన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పి.ఈ.టి  బి.మోహన్ కుమార్,వివిధ స్కూల్స్ ఉపాధ్యాయులు, విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొనినారు.ఈ కార్యక్రమమునకు అధ్యక్షులుగా జూనియర్ కాలేజీ లైబ్రేరియన్ పి.పుల్లయ్య నాయుడు, ఆహ్వానితులు వ్యాఖ్యాతగా జడ్.పి.     హెచ్ స్కూల్ సోషల్ మాస్టారు బి. నాగరాజు వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొనిన అతిధులు మాట్లాడుతూ విద్యార్థులందరూ గ్రంథాలయమునకు వచ్చి మీ పాఠ్యపుస్తకములతో పాటు గ్రంథాలయంలోని వివిధ పుస్తకములు చదువుట వలన విజ్ఞానం పెంపొందించుకొనవలసినదిగాను, క్రమం తప్పకుండా గ్రంథాలయమునకు వచ్చుట అలవాటు చేసుకోవాల్సిందిగా కోరినారు. గ్రంథాలయం లో ఉన్న పుస్తకాలు చదువుకొని మేమంతా ఉద్యోగాలు సంపాదించుకున్నమని గ్రంధాలయాల వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలియజేసినారు. అనంతరం ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు 58వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా 4 వ తరగతి నుండి ఇంటర్  వరకు నిర్వహించినటువంటి పోటీలు చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వం ,క్విజ్ పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ,ద్వితీయ, తృతీయ బహుమతులు ఈ కార్యక్రమమునకు హాజరు అయినా అతిధులచే బహుమతి ప్రధానం చేయబడినవి.ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, పాఠకులు ,సిబ్బంది పాల్గొనినారు. పాల్గొనిన వారికి స్వీట్ ప్యాకెట్స్ పంచి  పెట్టడం జరిగింది. వందన సమర్పణ గ్రంధాలయాధికారి దుగ్గిపోగు జాన్ బాబు చేసినారు.పాల్గొనిన అతిథులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరచి,58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగిస్తున్నట్లు ప్రకటించినారు.

About Author