ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పై ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉంది..
1 min read

హొళగుంద న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం కొత్తపేట, నేరణికి, నేరణికి తండా గ్రామాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మరియు సోదరుడు బుసినే శ్రీరాములు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ…పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకూడదని ప్రతి గ్రామం లో పార్టీలకతీతంగా ముందుకు వచ్చి సంతకాలు పెడుతున్నారన్నారు_ .ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పై ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉంది అన్నారు . వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో కూడా పేదలకు మేలు జరిగే విధంగా 17ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొని వచ్చినాడు అందులో ప్రారంభించి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రజలకు అందుబాటులో తెచ్చారు.. మిగతా 12 మెడికల్ కాలేజీలు కూడా 80% పూర్తి చేశారు .కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు . కూటమి ప్రభుత్వం18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకి నెలకు 1500 ఇస్తానని చెప్పి . ఇప్పుడు చూస్తే ఉసే లేదు.ఎస్సీ,ఎస్టీ, బీసీ వాళ్లకు 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్న అని చెప్పి ఇప్పుడు చూస్తే ఉన్న పెన్షన్లు కూడా తీస్తున్నారు.జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గకి ఆలూరు నియోజకవర్గంలో ఉండే నీటి సమస్య గురించి చెప్తే ఇప్పటివరకు పట్టించుకోవడం లేదన్నారు.ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం భ్రష్టి పట్టిస్తున్నారు. అదేవిధంగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సమక్షంలో గ్రామ అనుబంధ విభాగల కమిటీ నియమించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గం కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు.


