NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

26న దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయండి 

1 min read

సిపిఐ సిపిఎం మండల కార్యదర్శి 

పత్తికొండ, న్యూస్ ​నేడు:   కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని సిపిఐ, సిపిఎం మండల కార్యదర్శి కారుమంచి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక మాజీ ఎమ్మెల్యే ఈశ్వర రెడ్డి భవనందు వామపక్షాల ప్రజా సంఘాల నాయకులతో సమావేశం జరిగింది. సిఐటియు మండల కార్యదర్శి రవిచంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వామపక్షాల నాయకులు మాట్లాడుతూ, బ్రిటీష్ కాలంలో పోరాడి సాధించుకున్న కార్మికుల చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్గా మార్చి కార్మికులను బానిసలుగా కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగా ఉన్నాయని అన్నారు. వెంటనే నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంతో ప్రాణ త్యాగం చేసి వేల మంది అమరులై సాధించుకున్న కార్మిక హక్కులను కాల రాస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.ఇప్పటికే ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దుచేసి 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చిందని, కార్పొరేట్లకు అనుకూలమైన చట్టాలను తీసుకురావడం ద్వారా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందారు. ఈనెల 26వ తేదీన స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుండి ర్యాలీగాలుగు స్తంభాల దగ్గర నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు గోపాల్, ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు రంగన్న, నెట్టికంటయ్య, రైతు సంఘం నాయకులు సిద్దు, రాజుల కారప్ప, ఎస్ఎఫ్ఐ సెక్రెటరీ విష్ణు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు దస్తగిరి, హమాలి వర్కర్స్ నాయకులు ఉరుకుందు, డివైఎఫ్ఐ అల్లిపీరా, మాదన్న, ఆటో వర్కర్స్ నాయకులు ప్రశాంత్ పాల్గొన్నారు.

About Author