NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాజకుమారిని అభినందించిన ఎమ్మెల్యే జయసూర్య

1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు  : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చౌట్కూరు గ్రామానికి చెందిన ఈడిగ రమణమ్మ,కీ.శే జగన్నాధ గౌడ్ కుమార్తె అంబారపు రాజ కుమారి ఈనెల 15,16 తేదీల్లో కాకినాడ సూర్యకాళా మందిరంలో జరిగిన తైక్వాండో ఛాంపియన్ షిప్ అటల పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయి మొదటి స్థానంలో నిలిచి బంగారు పథకం సాధించిన సంగతి తెలిసిందే.విషయం తెలుసుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సోమవారం ఉదయం అల్లూరులో రాజ కుమారిని అభినందించి శాలువా పూల బోకేతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.రాబోయే రోజుల్లో ఆటల పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే అమ్మాయికి సూచించారు. వచ్చేనెల డిసెంబర్ 12,13 తేదీల్లో తెలంగాణలో జరిగే ప్రపంచ స్థాయిలో జరిగే పోటీలకు వెళ్ళనున్నట్లు రాజకుమారి తెలిపారు.ఈ కార్యక్రమంలో నరసింహ గౌడ్, శబ్బు,ఇంద్రసేషన్ గౌడ్ పాల్గొన్నారు.

About Author