NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డాక్టర్:బి.ఆర్.అంబేద్కర్ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచారు..

1 min read

పాత బస్టాండ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే బడేటి చంటి

69వ వర్ధంతి వేడుకలను ఘనంగా ఏర్పాటుచేసిన దళిత నాయకులు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పౌరులందరికీ సమాన హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని రూపుదిద్దిన భారతరత్న,డాక్టర్‌:బి.ఆర్‌. అంబేద్కర్‌కు ప్రతిఒక్కరూ రుణపడి ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే స్థానాన్ని అంబేద్కర్‌ సంపాదించారని ఆయన పేర్కొన్నారు. ఏలూరు పాతబస్టాండ్‌ సెంటర్‌లో శనివారం భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేద్కర్‌ 69వ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత దళిత నేతలతో కలిసి డాక్టర్‌:బీ.ఆర్‌. అంబేద్కర్‌ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎంతో విశిష్టత కలిగిన రాజ్యాంగాన్ని రచించడంలో అంబేద్కర్‌ చూపిన మేధస్సు ప్రపంచ దేశాలకు సైతం ఆదర్శంగా నిలిచిందన్నారు. సమాజంలోని అర్హులకు సమాన ప్రాతిపదికన విద్యా, వైద్యం అందేలా అనేక హక్కులను రాజ్యాంగంలో పొందుపర్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో  ఈడ చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్,ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి,కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎన్ఆర్ పెదబాబు, ఏలూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు,మాజీ వైస్ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు, జుంజు మోసెస్,తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ SC సెల్ అధ్యక్షులు పెద్దాడ రమణ, కార్యదర్శి మెల్లిపాక వెంకన్న తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకులు చౌటుపల్లి శ్రీనివాసరావు, జుజ్జువరపు ప్రతాప్, శ్రీకాకుళం రమేష్, పెదపూడి లోవరాజు, బయ్యారపు కుటుంబరావు, వినుకొండ శ్యామలరావు,శుభా మల్లిక్,కోడేలు చంటి, దళిత సంఘాల నాయకులు కందుల రమేష్, మేతర అజయ్ బాబు మరియు వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు దళిత సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

About Author