సిఐటియు 18వ జాతీయ మహాసభ సందర్భంగా జెండా ఆవిష్కరణ
1 min read

విశాఖపట్నంలో జరుగు సిఐటియు 18 జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన సిపిఎం, సిఐటియు మండల కార్యదర్శులు వెంకటేశ్వర్ రెడ్డి, ఎం రవిచంద్ర
పత్తికొండ, న్యూస్ నేడు: ఈనెల 31 నుండి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరుగుతున్న సిఐటియు 18వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం సిఐటియుల మండల కార్యదర్శులు వెంకటేశ్వర్ రెడ్డి రవిచంద్రలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు పత్తికొండ పట్టణంలోని సిఐటియు కార్యాలయం ముందు ఆటో వర్కర్స్ యూనియన్ అడ్డాల ముందు హమాలి వర్కర్స్ యూనియన్ అడ్డా ముందు సోమవారం సిఐటియు జెండాలను ఆవిష్కరించారు. సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నిర్వహించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విశాఖపట్నంలో ఈనెల 31 నుండి జనవరి 4 వరకు నిర్వహించే ఆల్ ఇండియా సిఐటియు మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు రాష్ట్ర పిలుపుమేరకు డిసెంబర్ 15వ తారీకు దేశవ్యాప్తంగా సిఐటియు అడ్డాలలో మరియు సిఐటియు కాలనీలో కార్మికుల ఇళ్లపైన జెండాలను ఆవిష్కరించుకోవాలని కార్మికుల బలోపేతాన్ని చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆటో కార్మిక సంఘం నాయకులు ప్రభాకర్, ఆటో వర్కర్ సీనియర్ నాయకులు అంజి, భాష, హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు ఉరుకుందు, రామాంజనేయులు, నడిపి, పులి, తదితరులు పాల్గొన్నారు.

