NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సమాచార హక్కు చట్టం పై అవగాహనా సదస్సు

1 min read

ఆర్ టి ఐ దరఖాస్తులకు సమాధానాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం,అలసత్వం వహించే అధికారులపై చట్టపరమైన చర్యలు ఉంటాయి

 జిల్లా ఖజానా,లెక్కల శాఖఅధికారి ఎన్.శ్రీనివాసులు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రజాస్వామ్యంలో పౌరుడికి అత్యంత శక్తివంతమైన సాధనంగా పేరుగాంచిన సమాచార హక్కు చట్టం (ఆర్ టి ఐ), 2005 అమలులోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఏలూరు జిల్లా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా ఖజానా కార్యాలయంలో జిల్లా స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు జిల్లా ఖజానా మరియు లెక్కల శాఖాధికారి ఎన్. శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శాఖలోని అధికారులకు మరియు ఉద్యోగులకు చట్టం అమలుపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. నిర్ణీత గడువు పాటించడంఆర్.టి.ఐ (RTI) దరఖాస్తులకు సమాధానాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం లేదా అలసత్వం వహించే అధికారులపై చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని, 25,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.పిఐo/ఏపీఐఓ  బాధ్యతలు పౌర సమాచార అధికారులు ( పి ఐ ఓ లు ), సహాయ పౌర సమాచార అధికారులు (ఏపీఐ ఓ)లు తమ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ, సమాచారాన్ని సేకరించడం మరియు నిర్ణీత గడువులోగా దరఖాస్తుదారునికి అందించే ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.ముందస్తు ప్రచురణ (సుమోటో డిస్‌క్లోజర్)చట్టంలోని సెక్షన్ 4(1)(బి) ప్రకారం, శాఖకు సంబంధించిన ముఖ్యమైన ఆర్థిక లావాదేవీల వివరాలు, పెన్షన్ల మంజూరు, బడ్జెట్ కేటాయింపులు వంటి సమాచారాన్ని దరఖాస్తు చేయకముందే పారదర్శకంగా వెబ్‌సైట్‌లో ప్రచురించాలని ఆదేశించారు.అవగాహన కార్యక్రమంలో ఏలూరు జిల్లా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖలో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని పెంచడానికి ఒక కీలక ముందడుగుగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఖజానా కార్యాలయ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

About Author