NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రపంచ పర్యాటక రంగానికి ఏపి గమ్యస్థానంగా మారుతుంది

1 min read

రానున్న నాలుగేళ్లలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో మొదటి స్థానంలో నిలిచేలా కృషి

ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మహర్దశ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక కోటదిబ్బ మంగళవారం రూ 5.25 కోట్ల (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు) నిధులతో ఏలూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా పురావస్తు ప్రదర్శనశాలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమా ఆటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ లాంఛనంగా ప్రారంభించారు. కేంద్రపర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో చర్చించి ఏలూరుకు సంగీత నృత్య కళాశాల మంజూరుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి  హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా పురావస్తు మ్యూజియంలోని డిజిటల్ బుక్కు రూమ్ ను, స్కల్ప్చర్ గ్యాలరీని సందర్శించారు. అధునాతన టెక్నాలజీతో రూపొందించిన  డిజిటల్ బుక్కులో ప్రతి పేజీలోని ఇమేజీని తాకితే  ప్రత్యక్ష అనుభూతిని పొందడం ఆశ్చర్యంగా ఉందని ఆసక్తిగా తిలకించారు. అదే విధంగా కాంస్య కళతో రూపొందించిన శ్రీరామ, లక్ష్మీనారాయణ, గరుడ, వైష్ణవ ఋషి, మావటి విగ్రహాలను తిలకించారు. భారతీయ జీవితాన్ని, ఆలోచనలు ప్రతిబింబింప చేసిన హిందూ, జైన, బౌద్ధ మతాలకు సంబంధించిన బుద్ధుడు, జైన తీర్థంకరులు, విష్ణువు, వెంకటేశ్వరుడు, ఆల్వార్లు,  శ్రీదేవిభూదేవి, నటరాజ కాంస్య శిల్పాలను పరిశీలించారు. నాటి కాలానికి సంబంధించిన శిరస్త్రాణం, ఖడ్గములు, డాలు, ఆయుధాలు, కవచాలను చూసారు. స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అంకురార్పణ చేసిన మ్యూజియాన్ని, నేటి ఎమ్మెల్యే బడేటి చంటి పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచం నలుమూలల రాష్ట్ర గొప్పతనాన్ని తెలిపేలా మ్యూజియం ఏర్పాటు చేయడం గొప్ప విషయం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏలూరు మేయర్ యస్.కె. నుర్జహన్ , ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, ఏలూరు ఉడా చైర్మన్ పెద్దబోయిన వాణిశివ ప్రసాదు, రాష్ట్ర పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్లు ఓ.రామ సుబ్బారెడ్డి, పి.సురేష్, సహాయ సంచాలకులు కె.తిమ్మరాజు, జిల్లా టూరిజం మేనేజరు యస్.పట్టాభి రామన్న, నగర కార్పొరేటరు పి.భీమేశ్వర రావు, ఏయంసి చైర్మన్ మామిడిపల్లి పార్థసారథి, నగరపాలక సంస్థ కమీషనరు ఏ.భాను ప్రతాప్, బిజెపి జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ కిషోర్, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టరు కె.వాణిశ్రీ, రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు, కూటమి నాయకులు రెడ్డీ. అప్పలనాయ్డు,కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, స్థానిక ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

About Author