NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రముఖ న్యాయవాది కలపాల రవి సెకండ్ ఏడిజె కోర్ట్ ఏజీపీగా నియామకం

1 min read

నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు ఆధ్వర్యంలో సన్మానం,సత్కారం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది కలపాల రవి సెకండ్ ఏడీజే కోర్టు కృష్ణా,ఏలూరు,తూర్పుగోదావరి జిల్లాల,ఏజీపీగా నియమితులుగా కాబడిన సందర్భంగా కలపాల.రవిని నేషనల్ దళిత జేఏసీ నాయకులు,ప్రముఖ న్యాయవాది  పెరికె వరప్రసాదరావు ఆధ్వర్యంలో స్థానిక ఫైర్ స్టేషన్. కోర్టు సెంటర్ లో మంగళవారం ఏజిపి రవిని న్యాయవాద మిత్రులు శాలువాలు కప్పి, పూల బొకేలు అందించి ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సత్కార కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, నేషనల్ దళిత  జేఏసీ నాయకులు అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాది రవి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరి మనసులో మంచి వ్యక్తిగా, సహాయకారిగా సుస్థిర స్థానాన్ని సంపాదించరన్నారు. ఆయన మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని పలువురు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా   తెలుగు రాష్ట్రాల ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి,జాతీయ మాదిగ సీనియర్ నాయకులు హరికృష్ణ మాట్లాడుతూఏలూరు నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన కలపాల రవిని ఏజీపీగా నియమింపజేసిన స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ య్య(చంటి) కి మాదిగల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అడ్వకేట్స్ కమిడి.మోహన్  చంద్ర,మద్దాల.గోపాలరావు, మద్దాల.వాసుదేవరావు, జుజ్జువరపు. ప్రసాదరావు,మట్ట విద్యార్థి, మట్ట విద్యాసాగర్, మందపల్లి లోహిత్,దొండపాటి రవి శేఖర్, జాతీయ సీనియర్ దళిత నాయకులు డాక్టర్:పొలిమేర హరికృష్ణ , బిఎస్పి జిల్లా అధ్యక్షులు సిరా. భరత్ రావు తదితర జేఏసీ నాయకులు,ఎస్సీ నాయకులు అడ్వకేట్స్ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేశారు.

About Author