NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇన్నోవేషన్‌​, సంస్కృతి సంగమంగా లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ తొలి కంపెనీ డే

1 min read

హైదరాబాద్‌, న్యూస్​ నేడు :  లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్‌ (ఎల్ టి సి) తన తొలి కంపెనీ డేను హైదరాబాద్‌లోని అన్వయ కన్వెన్షన్స్‌లో విజయవంతంగా నిర్వహించింది. సంస్థ ప్రయాణం, ఉద్యోగులు, అలాగే ఇన్నోవేషన్‌, ఐక్యత, లక్ష్యసాధనపై ఆధారపడిన బలమైన సంస్కృతిని ఘనంగా జరుపుకునేందుకు ఈ అంతర్గత కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. టెక్నాలజీ ప్రదర్శనలు, నాయకత్వ ప్రసంగాలు, ఉద్యోగుల ప్రతిభకు గుర్తింపు, సాంస్కృతిక కార్యక్రమాలు కలిసిన ఒక సంపూర్ణ అనుభవంగా ఈ కార్యక్రమం నిలిచింది.ఈ రోజంతా జరిగిన కార్యక్రమాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ప్రాజెక్ట్ షోకేస్ . ఎల్ టి సిలో జరుగుతున్న అత్యాధునిక సాంకేతిక అభివృద్ధి, ఇన్నోవేటివ్‌ సొల్యూషన్స్‌ను ఇది స్పష్టంగా చూపించింది. ప్రతిభావంతమైన బృందాలు తమ అత్యంత ప్రభావవంతమైన ఆవిష్కరణలను మూడు నిమిషాల సంక్షిప్త ప్రజెంటేషన్ రూపంలో ప్రదర్శించగా, వీటిని ప్రతిష్ఠాత్మక అంతర్గత జ్యూరీ మూల్యాంకనం చేసింది. ఈ ప్రదర్శన ప్రపంచస్థాయి టెక్నాలజీ సామర్థ్యాలను నిర్మించాలన్న ఎల్ టి సి నిబద్ధతను చాటిచెప్పింది . ఈ సందర్భంగా ల్ టి సి నాయకత్వ బృందం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఉద్యోగి కేంద్రిత కార్యక్రమాలు, కమ్యూనిటీ ప్రోగ్రామ్స్‌, సస్టెయినబిలిటీ చర్యలు, అలాగే సంస్థ భవిష్యత్‌ దృక్పథంపై కీలక సమాచారాన్ని పంచుకుంది.మేము ప్రపంచస్థాయి టెక్నాలజీనే కాకుండా, ప్రతి వ్యక్తి విలువైనవాడిగా భావించే, భవిష్యత్తును మలిచే శక్తి ఉన్న సమగ్ర కార్యాలయ వాతావరణాన్ని కూడా నిర్మిస్తున్నాం” అని అన్నారు.4050కిపైగా ఉద్యోగులతో, ​ఎ​ల్ టి సి ఇంజినీరింగ్ ఎక్సలెన్స్‌ను అందిస్తూ, ఇన్నోవేషన్‌ను ప్రోత్సహిస్తూ, సమగ్ర వృద్ధిని సాధిస్తోంది. భారత్‌లో ఆర్థిక సేవలను అందించకపోయినా, లాయిడ్స్ గ్లోబల్ టెక్ వ్యూహంలో ఇది ఒక కీలక భాగంగా కొనసాగుతోంది.

About Author