NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సివిల్ సప్లై అద్దె గోడౌన్ల  స్థానంలో సొంత గోడౌన్లను నిర్మించాలి

1 min read

సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర

 సివిల్ సప్లై హమాలీలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి  వెంకటేశ్వర్ రెడ్డి

పత్తికొండ, న్యూస్​ నేడు: సివిల్ సప్లై అద్దె గోడౌన్ల స్థానంలో ప్రభుత్వ గోడౌన్లను ఏర్పాటు చేయాలని, సివిల్ సప్లై హమాలీలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, సివిల్ సప్లై గొడవ హమాలీలకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, అలాగే వారిని నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ గురువారం సిపిఎం, సిఐటియు, హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అంతకంటే ముందు స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయం నుండి తాసిల్దార్  కార్యాలయం వరకు సిఐటియు సివిల్ సప్లై హమాలీ వర్కర్స ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిఐటియు మండల అధ్యక్షులు డి గోపాల్ అధ్యక్షతన వహించగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నరసన్న, మాట్లాడుతూ, సివిల్ సప్లై అద్దె గోడౌన్ల  స్థానంలో ప్రభుత్వ గోడౌన్లను ఏర్పాటు చేయాలని, అద్దె గోడౌన్ల వలన హమాలీలు అనేక ఇబ్బందులకు గురవుతూ, అనారోగ్య పరిస్థితులకు లోనవుతున్నారని తెలిపారు. సివిల్ సప్లై హమాలీలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రమాద బీమా, ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సివిల్ సప్లై  హమాలీల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పైన కర్షకుల పైన ఉక్కు పాదం మోపడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.

About Author