NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రయాణికులకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటాం

1 min read

ప్యాపిలి సబ్ ఇన్స్పెక్టర్ పి నాగార్జున

ప్యాపిలి న్యూస్ నేడు: ప్రయాణికుల భద్రతకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్యాపిలి సబ్ ఇన్స్పెక్టర్ పి.నాగార్జున అన్నారు. ఈ సందర్భంగా శనివారం ప్యాపిలి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆయన తోపాటు తమ సిబ్బందితో ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలను పరిశీలిస్తూ బస్టాండ్ ఆవరణలో ద్విచక్ర వాహనాలు ఎక్కడపడితే అక్కడ నిలబెట్టడంతో, బస్టాండ్ ఆవరణలో అపరిశుభ్రంగా ఉండడంతో ఆయన డిపో మేనేజర్ చేరవాణితో మాట్లాడి బస్టాండ్ ఆవరణలో ఎక్కడపడితే అక్కడ ద్విచక్ర వాహనాలు ఉండడంతో రాకపోక బస్సులకు ఇబ్బందులు కలుగుతూ ప్రజలకు కూడా ఇబ్బందులు వస్తున్నాయని అలాగే టాయిలెట్లు కూడా శుభ్రంగా లేవని త్రాగునీరు కులాయి దగ్గర ఆ శుభ్రంగా ఉండడంతో పరిశుభ్రంగా ఉండకపోతే ప్రయాణికులు తమకు కంప్లైంట్ ఇస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఆటో డ్రైవర్లకు శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై పోలీసులు లేదా సంబంధిత అధికారులు కఠినంగా శిక్షలు తప్పవని,  ఆర్టీసీ బస్సుల ప్రయాణ మార్గాల్లో అసాంఘిక కార్యకలాపాలు, వేధింపులు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని శిక్షిస్తామని ఆయన అన్నారు. ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులు నిర్భయంగా ప్రయాణించేలా చూడటం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారు, వేగంగా నడిపేవారు, తాగి నడిపేవారిపై చర్యలు తీసుకోవడం, మత్తు పదార్థాల అమ్మకం, సైబర్ నేరాలు, దొంగతనాలు వంటి వాటిని అరికట్టడం,ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఏదైనా సమస్య ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరడం (ఉదా: 100కు కాల్ చేయడం), ఈ హెచ్చరిక ప్రయాణ సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని సూచిస్తుంది, దీని ద్వారా ప్రయాణ వ్యవస్థలో క్రమశిక్షణ, భద్రత ఉండేలా చూసుకోవాలి ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author