బాల్యవివాహాలను అరికట్టి భారతదేశ అభివృద్ధికి సహకరిద్దాం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ అధికార సంస్థ కర్నూలు వారి సూచనల మేరకు 100 రోజుల బాల్య వివాహ రహిత భారత్ కార్యక్రమ ము లో భాగముగా కర్నూలు వెంకట రమణ కాలనీ లయన్స్ క్లబ్ ఆఫీస్ నందు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ వాలంటీర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. 100 రోజుల బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా శ్రీ శిశు సంక్షేమ శాఖ, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో వెంకటరమణ కాలనీ నందు గల లైన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు కార్యాలయం నందు కాలనీ వాసులకు వారి పిల్లలకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలను అరికట్టి భారతదేశ అభివృద్ధికి సహకరిద్దామని రాయపాటి శ్రీనివాస్ అన్నారు. పిల్లలు తమ కాళ్ళపై తాము నిలబడాలంటే మంచి చదువులు చదవి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కనీసం డిగ్రీ దాకా చదివి తమ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షించారు. బాల్యవివాహాలు వ్యతిరేకించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. బాల్య వివాహాలు చేసుకుంటే ఎన్నో నష్టాలు ఉన్నాయని వివరించారు. మీకు దగ్గరలో మీకు తెలిసి బల్లె వివాహాలు జరుగుతుంటే ఆ సమాచారాన్ని చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 కానీ లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్15100 గాని కాల్ చేస్తే వారు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి నిలుపుదల చేస్తారని తెలిపారు. అనంతరం పిల్లలచే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ త్రినాథ్ కుమార్, రిటైర్డ్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్, రిటైర్డ్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ రంగనాథ్ డాక్టర్ జయప్రకాష్ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శంకరప్ప, కాలనీ వాసులు పాల్గొన్నారు.

