స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పై విస్తృతంగా చర్చ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ప్రధాన జిల్లా న్యాయమూర్తి కమ్ చైర్మన్, జిల్లా న్యాయ సేవా సంస్థ , కర్నూలు జి. కబర్ధి వారి ఆదేశాల మేరకు, బి. లీల వెంకట శేషాద్రి , కార్యదర్శి, జిల్లా న్యాయ సేవా సంస్థ, కర్నూలు వారు తేదీ: 24.12.2025 న మధ్యాహ్నం 3.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక ముఖ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి కర్నూలు జిల్లా జైలు సూపరింటెండెంట్, అన్ని ఉప జైలు సూపరింటెండెంట్లు, జైలు విజిటింగ్ లాయర్లు, మరియు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ వారుకేసులో అండర్ ట్రయల్ ఖైదీలు సంబంధించి జారీ చేసిన ఆదేశాల అమలుకు రూపొందించిన సవరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పై విస్తృతంగా చర్చ జరిగింది. కార్యదర్శి , సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, బెయిల్‌కు అర్హత కలిగిన అండర్ ట్రయల్ ఖైదీల విడుదలకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని సంబంధిత అధికారులను కోరారు. ముఖ్యంగా, అండర్ ట్రయల్ ఖైదీల వివరాలను అండర్ ట్రయల్ ప్రిజనర్ కమిటీముందు ఉంచి, విడుదలకు సంబంధించిన చర్యలు వేగవంతంగా చేపట్టాలని సూచించారు.దేవిధంగా, ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్షకు లోబడే నేరాలకు సంబంధించి రిమాండ్‌లో ఉన్న ఖైదీల విడుదలకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. ఈ విషయంలో జైలు అధికారులు, జైలు విజిటింగ్ లాయర్లు మరియు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్లు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సవరించిన SOP ను కచ్చితంగా అమలు చేయడం ద్వారా అండర్ ట్రయల్ ఖైదీల హక్కుల పరిరక్షణ, అనవసర నిర్బంధం నివారణ, మరియు గౌరవనీయ సుప్రీం కోర్టు ఆదేశాల సమర్థవంతమైన అమలు సాధించడమే ఈ సమావేశం ముఖ్య లక్ష్యమనికార్యదర్శి తెలిపారు.

