NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భక్తిశ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి వేడుకలు

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: అత్యంత ప్రీతి పరమైన  కలియుగ దైవం విష్ణుమూర్తి స్వామి వారికి ఇష్టమైన తొలి ఏకాదశి ,ముక్కోటి ఏకాదశి పర్వదిన పండుగను పురస్కరించుకొని మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు.ప్యాపిలి పట్టణంలోని కిందికేరిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మరియు మఠంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా  ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని కిందికిరిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో  ఆలయ నిర్వహకులు  కీర్తిశేషులు మిరపకాయల కొండన్న గారి కుమారుడు మిరపకాయల రమేష్ బాబు  ఆధ్వరంలో ఆలయ అర్చకులు వెంకటరమణ సన్నిధిలో స్వామివారికి అభిషేకములు, కుంకుమార్చనలు, ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

About Author