NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బొకే వద్దు-మొక్కే ముద్దు…

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  నూతన సంవత్సరానికి మొక్కలతో స్వాగతం పలకండి.. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బి సురేష్ కుమార్. నూతన సంవత్సరానికి బొకేలు స్వీట్ డబ్బాలకు బదులుగా పచ్చని మొక్కలను నలుగురికి ఉపయోగపడే బుక్స్ పెన్సిల్ లు అందజేసి శుభాకాంక్షలు తెలుపుకోవడం ద్వారా నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బి సురేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి శ్రీరాములు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కలెక్టర్ ను కలిసి ఉన్నతాధికారుల వద్దకు వచ్చే వారిని మొక్కలు మాత్రం తీసుకొని వస్తే బాగుంటుందని కోరగా జిల్లా కలెక్టర్ స్పందిస్తూ మంచి సంప్రదాయమని తాను ముందు నుంచి ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నానని తప్పకుండా తన వద్దకు వచ్చేవారు పచ్చని మొక్కలతో శుభాకాంక్షలు తెలిపితే బాగుంటుందన్నారు.

About Author