పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అవగాహన వర్క్ షాప్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఈ రోజు డిసెంబర్ 31 తేదీన సమగ్ర శిక్ష జిల్లా కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది.పీఎం శ్రీ (PM SHRI) పాఠశాలలు మిగిలిన పాఠశాలలకు ఆదర్శంగా నిలవాలని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ N.B. లోకరాజు కర్నూలు జిల్లా నందు జిల్లాలోని 54 పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు SNA-SPARSH మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ ఎన్ ఎ- స్పర్శ గురించి పూర్తిస్థాయిలో అవగాహనపరిచి తదుపరి పీఎం శ్రీ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి రూపాయికి లెక్క చూపించాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులపై ఉందని స్పష్టం చేశారు.సీఎఫ్ఎంఎస్ (CFMS) విధానంలో బిల్లులను ఆన్లైన్లో ఎలా అప్లోడ్ చేయాలి, వెండర్ అకౌంట్ ఎలా సృష్టించాలి, ఈ ప్రక్రియలో పాటించాల్సిన నియమ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించారు.PM SHRI Phase–1, 2 & 7 పాఠశాలల హెచ్ఓడీలకు “ONE DAY ORIENTATION on SNA–SPARSH” కార్యక్రమం ద్వారా పూర్తి స్థాయి అవగాహన అందించడం జరిగింది. బిల్లుల అప్లోడింగ్ విధానం, వెండర్ అకౌంట్ క్రియేషన్, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పాటించాల్సిన అంశాలను వివరించారు.ఈ విధానం భారతదేశం అంతటా అమలులో ఉందని, ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఫైనాన్స్ ఆఫీసర్ లు రజిని బాయ్ , వెంకటేశ్వర్లు , ప్రధానోపాధ్యాయులు సారథి శర్మ, వెంకటేశ్వర్లు, రిసోర్స్ పర్సన్స్‌గా పాల్గొని విలువైన సూచనలు చేశారు.ఈ అవగాహన కార్యక్రమం పీఎం శ్రీ పాఠశాలల సమర్థవంతమైన నిర్వహణకు, ఆర్థిక క్రమశిక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని పాల్గొన్న ప్రధానోపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమాన్ని AMO ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.

