ఏలూరు జిల్లా పరిధిలో 2025 పోలీస్ యంత్రాంగం సమిష్టి కృషితో నేరాలు వాటి నియంత్రణ
1 min read

జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్
విలేకరుల సమావేశంలో పలు అంశాలు వెల్లడి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిశోర్,ఐ.పీ.ఎస్ వారి యొక్క అధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం సమిష్టి కృషితో 2025 వ సంవత్సరములో నేరాలను అదుపు చేసినారు.కొమ్మి ప్రతాప్ శివ కిశోర్, ఐ.పీ.ఎస్ వారు పదవీ బాధ్యతలు స్వీకరించిన దగ్గర్నుండి నేర నియంత్రణ కొరకు మరియు గంజాయి, నాటు సారాయి ఇతర రాష్ట్రాల నుండి మద్యం మరియు ఇసుక అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన చెక్‌పోస్టులను అంతర్ జిల్లా అంతర రాష్ట్రాల వద్ద ఏర్పాటు చేసి సదరు చెక్‌పోస్టుల వద్ద 24/7 ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయ కలిగినారు.2025 సంవత్సరం లో జిల్లాలో నమోదు కాబడిన కేసుల యొక్క వివరములు:2025 సంవత్సరం లో 26 మర్డర్ కేసులు నమోదు కాగా, 2024 సంవత్సరములు 39 కేసులను నమోదు చేసినట్లు 2023 వ సంవత్సరంలో 35 కేసులను నమోదు చేసినట్లు, సదరు హత్య కేసులు సెక్సువల్ జెలసి, సరిహద్దు తగాదాలు, పెట్టి తగాదాల మూలముగా జరిగినవి. అన్ని కేసులలో ముద్దాయిలను అరెస్టు చెయ్యడం జరిగింది.ఈ సంవత్సరం 2025 లో 29 అపహరణ కేసులు నమోదు కాగా, 2024 లో 54 కేసులు, 2023 లో 106 కేసులు నమోదు చేయడమైనది. అపహరణ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడం జరిగింది. ఈ సంవత్సరం 2025 లో 59 మానభంగం కేసులు నమోదు కాగా, 2024 లో 80 కేసులు, 2023 లో 63 కేసులు నమోదు చేయడమైనది. జిల్లాలో మహిళల భద్రతకు అన్నీ రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందువలన మానభంగం కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడం జరిగింది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2025 లో, 125 POCSO Act కేసులు నమోదు కాగా, 2024 లో 160 కేసులు, 2023 లో 147 కేసులు నమోదు చేయడమైనది. జిల్లాలో పిల్లల యొక్క భద్రతకు అన్నీ రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే కొత్త చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. స్కూలు మరియు కాలేజీలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ర్యాగింగ్, మరియు పిల్లల చట్టాలపై విధ్యార్ధులకు అవగాహనలను కల్పిస్తుండడం జరుగురుతుంది. ఇందువలన POCSO Act కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడం జరిగింది.

