NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మన్న అధ్వర్యంలో ఘనంగా కొత్త సంవత్సర వేడుకలు

1 min read

మంత్రాలయం న్యూస్ నేడు :   మంత్రాలయంలో జనసేన పార్టీ ఇన్చార్జి, రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ,రాష్ట్ర అధ్యక్షులు వాల్మీకి బి లక్ష్మన్న అధ్వర్యంలో గురువారం తన నివాసంలో 2026 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జనసేన నాయకులు కార్యకర్తలు ముందుగా లక్ష్మన్న కు శాలువా కప్పి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గం ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో  సుఖ జీవనం సాగించాలని ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని, రాఘవేంద్ర స్వామిని, అల్లాహ్ ను, ఏసుక్రీస్తు ను ప్రార్థిస్తున్నానని తెలిపారు.  అనంతరం  జాలాడి జైపాల్ కొత్త ద్విచక్ర వాహనం ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద పెడబూర్ జనసేన పార్టీ మండల అధ్యక్షులు జి బజారి ( అబ్రహం ), కోసిగి జనసేన పార్టీ మండల అధ్యక్షులు సి వీరారెడ్డి, కౌతాళం మండల నాయకులు చిన్న, ఎర్రి స్వామి, వై నాగేష్, ఈరన్న, ఏసోబు మరియు కోసిగి మండలం నుంచి కరీం స్వామి, నరసింహులు, పెద్ద కడబూర్  మండలం నుంచి పెద్ద కడూరు సింగల్ విండో డైరెక్టర్ ఎస్ అనిమేష్, ఉపాధ్యక్షుడు ఆలీ భాష, ప్రభుదాస్, లింగన్న, జైపాల్, బంగారయ్య మరియు మంత్రాలయం మండలం నుంచి మంత్రాలయం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బివి రవిచంద్ర, మిడిల్దిన్ని రాగు, గిడ్డయ్య, పవన్, దుల్లయ్య, వెంకటేష్, అడవి రాగు  మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author