అందరికి సమ్మతితోనే నాలెడ్జ్ సెంటర్ నిర్మాణం..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: అడిషనల్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ… కర్నూల్ మెడికల్ కాలేజీలో మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం అల్యూమిననీ ఆధ్వర్యంలో 50 కోట్లతో నిర్మించ తలపెట్టిన మల్టీ యుటిలిటీ సెంటర్ భవన నిర్మాణం అందరి సమ్మతితోనే చేపట్టడం జరుగుతుందని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కే చిట్టి నర్సమ్మ అన్నారు. శుక్రవారం తనను కలిసిన ఏపీజీడిఏ నాయకులు విద్యార్థులతో వారు మాట్లాడుతూ గత నెల 26వ తేదీన గౌరవ మంత్రివర్యులు ఆధ్వర్యంలో కాలేజీలో జరిగిన సమావేశంలో గతంలో గ్రౌండ్ లో నిర్మాణం పై ఏర్పడిన వివాదం పరిష్కరించేందుకు గ్రౌండ్ యందు కాకుండా గ్రౌండ్ కు ఇబ్బంది లేకుండా మల్టీ యుటిలిటీ భవన నిర్మాణానికి అందరి సమక్షతోనే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ భవన నిర్మాణం పై ఏపీ జి డి ఏ కాలేజీ విద్యార్థులు కుంకోసా భవనానికి ఇబ్బందులు లేకుండా చూడాలని, మల్టి యుటిలిటీ భవనం ఎవరి నిర్వహణలో ఉంటుందని అడగగా భవనం నిర్వహణ పూర్తిక కాలేజీ ప్రిన్సిపల్ చేతుల్లోనే ఉంటుందని తెలపడం జరిగింది. ఇప్పటికే ఈ అంశంపై చాలాసార్లు చర్చలు జరిగాయి అని గ్రౌండ్ కు ఇబ్బంది లేకుండా నిర్మాణం అంటేనే గౌరవ మంత్రి వర్యులు ఆధ్వర్యం లో అందరూ ఒప్పుకున్నారని ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్రాతపూర్వకంగా ఇవ్వాలని ప్రిన్సిపల్ కోరారు. 26వ తేదీ నిర్ణయం తీసుకోగా ఇంతవరకు ఎటువంటి అభ్యంతరం తెలుపలేదని ఇప్పుడు కూడా వ్రాతపూర్వకంగా ఇవ్వలేదని కారణాలు వివరిస్తూ వ్రాత పూర్వకంగా ఉంటేనే పై అధికారులకు తెలియజేయడానికి అవకాశం ఉంటుందని కావున ఎటువంటి అభ్యంతరం అయినా అభ్యంతరానికి గల కారణాలు తెలుపుతూ వ్రాత పూర్వకంగా ఇవ్వాలని ఆమె తెలిపారు.

