NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సావిత్రి బాయ్ ఫూలే 123వ జయంతి వేడుకలు

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిరం లో సావిత్రి బాయ్ ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు.ప్రధానాచార్యులు చిత్ర పటానికి మాల వేసి పూజలు నిర్వహించారు. సీనియర్ ఆచార్యులు వాసు మాట్లాడుతూ భాగంగా మహిళా ఆచార్యులు అందరికి సావిత్రి భాయ్ జయంతి సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేసారు.ఆమె 1831వ సంవత్సరం లో ముంబై లో ని  సతారా జిల్లాలో జన్మించింది. ఈమె 1948వ సంవత్సరం లో బాలికల మొట్ట మొదటి పాఠశాల స్థాపించి మొట్ట మొదటి ఉపాధ్యాయురాలు గా పని చేశారు. బాల బాలికల కోసం వసతి గృహాలు కూడ స్థాపించారు. 1897లో ప్లేగు వ్యాధి నిర్ములన కోసం పోరాటం చేశారు. ఈమె బ్రాహ్మణ కులం చెందిన వారైనా దళితుల కోసం ఎంతో పోరాడింది. దీని కోసం గ్రామంలో ఆమె మీదకి రాళ్లు, బురద మట్టి చల్లిన పాఠశాల కొనసాగించిందని వారు తెలిపారు.ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author