NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళ ఉపాధ్యాయ దినోత్సవం (సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రి బాయి జయంతిని పురష్కరిచుకొని మహిళ ఉపాధ్యాయ దినోత్సవం ను జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా శనివారం ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం  సావిత్రి బాయి చిత్రపటానికి పూల మాల వేసి అనంతరం విద్యార్థుల ను ఉద్దేశించి మాట్లాడుతూసావిత్రి బాయి పూలే భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, సామాజిక సంస్కర్తగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆమె జయంతి జనవరి 3న  మహిళ ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకుంటాము.సావిత్రి బాయి పూలే 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నయాగావ్ గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించింది. తొమ్మిది సంవత్సరాల వయసులోనే జ్యోతిరావు పూలేను వివాహం చేసుకుంది.సామాజిక కృషిభర్త ప్రోత్సాహంతో అక్షరాభ్యాసం చేసుకుని, 1848లో పూణేలో నిమ్నవర్గాల బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించింది.ఈ కార్యక్రమంలో  ఎన్ఎస్ఎస్ పిఓ నవీన పాటి  అధ్యాపకులురామకృష్ణయ్యఓబులేసు, వెంకటరమణ, మద్దిలేటి, మురళి మోహన్, ముస్తాక్, శంకరయ్య, వెంకటేశ్వర్లు, సురేష్, మంజునాథ్, వన్నూర్ మరియు ఎన్ఎస్ఎస్  వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.

About Author