స్వచ్ఛ ఆంధ్ర -స్వచ్ఛ సంకల్పం కోసం గ్రామ సభ
1 min read

కౌతళం న్యూస్ నేడు: మండల కేంద్రమైన ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గౌరవ సర్పంచ్ పాల్ దినకర్ అధ్యక్షతన,పంచాయతీ కార్యదర్శి ఏ . యోగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో “గ్రామ సభ” ఏర్పటు చేశారు. ఈ కార్యక్రమానికి మండల పరిపాలన అధికారి పి.గోపాల్ హాజరయ్యారు. ఈ సభలో గత సంవత్సరంలో జరిగిన పనులు మరియు రాబోయే రోజుల్లో జరగబోయే పనుల గురించి చర్చించారు. ఆరోగ్యశాఖ అధికారి వారి ద్వార ఆరోగ్యపరమైన సూచనలు వినివించడం,శానిటేషన్, ప్రభుత్వపరంగా వస్తున్న పథకాలు అమలు విధానం గురించి సంబంధిత శాఖల ద్వారా చర్చించడం, నీటి సమస్య , వివిధ రకాల సచివాలయం నుంచి పథకాలు గురించి సిబ్బంది ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు, వివిధ శాఖలకు సంబంధించిన అదికారులు,సచివాలయం సిబ్బంది,పంచాయతీ సిబ్బంది,గ్రామ ప్రజలు, పాల్గొన్నారు.

