NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రిలే నిరాహార దీక్ష చేపట్టిన సహకార సంఘం ఉద్యోగులు

1 min read

సహకార ఉద్యోగుల న్యాయమైన కోరికలు ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. సిపిఎం మండల కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి  ఎం. రవిచంద్ర, 

పత్తికొండ, న్యూస్​ నేడు:   సహకార సంఘం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని పత్తికొండ పట్టణంలోని స్థానిక కేడిసిసి బ్యాంక్ ముందు సహకార సంఘం ఉద్యోగులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈనెల 9వ తారీకు వరకు చేపట్టే  దీక్షలో మొదటిరోజు సహకార సంఘం ఉద్యోగులు రహంతుల్లా, గిడ్డయ్య, ఏసుప్రభుక్త, మల్లికార్జున, చాంద్బాషా కూర్చున్నారు.  ఈ కార్యక్రమానికి మల్లికార్జున అధ్యక్షతన వహించగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి,సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జీవో నెంబర్ 36ను వెంటనే పూర్తి అమలు చేయాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, జీతభత్యాలు డ్యూటు పద్దులు రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 2019 తర్వాత సహకార సంఘం లో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులైజేషన్ చేయాలని పి ఏ సి ఎస్ ల ద్వారా కాకుండా డిసిసిబి ల ద్వారా రైతులకు డైరెక్ట్ గా రుణాలు ఇస్తున్నారని దీనివల్ల పిఎసిఎస్ నిర్వీరం అయిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కంప్యూటర్ ఆపరేటర్లను సీనియారిటీ ప్రాతిపదికన జిల్లాలో ఖాళీగా ఉన్న సీఈవో పదవులను వీరితో భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. 2019 మరియు 2024 పెండింగ్లో ఉన్న వేతన సవరణ వెంటనే అమలు చేయాలన్నారు. ఉద్యోగులకు ఐదు లక్షలు వరకు ఆరోగ్య భీమ  కల్పించాలని వారు తెలిపారు. గ్రాజువిటీ చట్టాలకు అనుసంధానంగా వారికి వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మన డిమాండ్ చేశారు.

About Author