NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దాడులను ఎప్పటికీ ప్రోత్సహించను.. మంత్రి టీజీ భరత్

1 min read

కర్నూలు , న్యూస్​ నేడు: క‌ర్నూలు జిల్లాలో ఇటీవ‌ల ఓ సోష‌ల్ మీడియా కార్యక‌ర్తపై జ‌రిగిన దాడి విష‌యం తన దృష్టికి వచ్చిందని, ఈ దాడిని ఖండిస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులోని ఆయన కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘ‌ట‌న అనంత‌రం నిజానిజాలు నిర్ధారించుకోకుండా నా క్యాడ‌ర్‌పై నింద‌లు వేయ‌డం స‌రైంది కాదు. బాదితుడు ప‌లు చెడు వ్యస‌నాల ద్వారా తీవ్రమైన అనారోగ్యం బారిన ప‌డిన‌ట్లు నాకు తెలిసింది. ఘ‌ట‌న‌కు ఇవే కార‌ణ‌మై ఉంటాయ‌న్న పుకార్లు వినిపిస్తున్నాయి. వాస్త‌వాలు తెలుసుకోకుండా నా క్యాడ‌ర్‌పై బెదిరింపులు, దాడుల‌కు పాల్పడాల‌ని ప్రయ‌త్నిస్తే చూస్తూ ఊరుకునేది లేదు. అస‌లు ఇలాంటి దాడుల‌ను నేను ఎప్పటికీ ప్రోత్సహించ‌ను. చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హ‌క్కు ఎవ్వరికీ లేదు. ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడేవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం అని ఆయన అన్నారు.

About Author