రక్తదానం చేసిన కార్యకర్తలకు సీఎం చేతుల మీదుగా సర్టిఫికెట్లు ఆందజేత
1 min read

హోళగుంద న్యూస్ నేడు: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన కార్యకర్తలకు సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందించారు. టీడీపీ హొళగుంద మండల మైనార్టీ అధ్యక్షులు ముల్లా మొయిన్ రక్తదానంలో పాల్గొని సీఎం చేతులమీదుగా సర్టిఫికెట అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ సీఎం చంద్రబాబునాయుడు చేతులమీదుగా సర్టిఫికెట్ అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. సందర్బంగా టీడీపీ పార్టీ అలూరు నియోజక ఇన్చార్జి వైకుంఠం జ్యోతి, వైకుంఠం శివప్రసాద్ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హోళగుందమండలంలో ఉన్న ముస్లిం శ్మశాన వాటిక అభివ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అలాగే 2019 సంవత్సరంలో మంజూరైన ఎస్క్రీ. గ్రాంట్ ద్వారా చేపట్టాల్సిన సీసీ రోడ్డు పని విషయాన్ని కూడా వివరించినట్లు తెలిపారు. సమస పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సీఎం హ ఇచ్చారని ఆయన తెలిపారు.



