NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  సోమవారం ఉదయం 10 గంటలకు పవిత్ర తుంగభద్రా నది తీరంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి మరియు భవాని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం లో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది,            సరిగ్గా ఉదయం 10 గంటలకు శ్రీ టీజీ వెంకటేష్ మాజీ రాజ్యసభ సభ్యులు హరి హర క్షేత్ర అభివృద్ధి ప్రదాత   వారి కుటుంబ సభ్యులు సమేతంగా విచ్చేసి నారు.   వారికి ఆలయ మర్యాదలతో   పూర్ణ కుంభ స్వాగతం వేద పండితులచే  ఆహ్వానించడం ద్వారా ద్వజారోహణ చేసి గరుడ      ద్వజం ప్రతిష్టించడం జరిగింది అనంతరం నూతనంగా నిర్మించిన యాగశాలను కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి దివ్య మంగళ హారతి ఇచ్చి వారిని సత్కరించడం జరిగింది , ఈరోజు మొదటి రోజు యధావిధిగా లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరిగింది దాదాపు ఒక 600 మందికి భోజనం వసతి ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారి రథోత్సవం శేష వాహనం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులు భారీ ఎత్తున హాజరై రథోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆలయ కమిటీ వారు అధ్యక్షులు శ్రీ సండేల్ చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షులు సివి దుర్గాప్రసాద్ గారు, కార్యదర్శి చల్ల నాగరాజు శర్మగారు, ఉపాధ్యక్షులు కంచుగంటల శ్యాంసుందర్రావు, ఉప కార్యదర్శి నాగులవరం రాజశేఖర్ గారు, కోశాధికారి సిఎస్ ప్రసాదరావు, గౌరవ సలహాదారు టీవీ రవిచంద్ర శర్మ, మామిళ్ళపల్లి రాజేష్ శర్మ, సివి మురళీకృష్ణ, శ్రీనివాసరాజు, ఆకెళ్ళ రాధాకృష్ణ, మరియు గౌరవ మహిళా సభ్యులు, శ్రీవారి సేవకులు ఈసీ మెంబర్లు కర్నూల్ నగర బ్రాహ్మణ సంఘ సభ్యులు  విజ్ఞప్తి చేశారు.ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని అంతా కూడా మామిళ్ళపల్లి చంద్రశేఖర శర్మ  బృందం చేతుల మీదుగా పది రోజులు జరుగుతుంది.

About Author