న్యూరో చికిత్సలకు కేంద్రంగా.. ‘మెడికవర్ హాస్పిటల్స్’
1 min read
న్యూరో సర్జరి డా. వంశీ కృష్ణకు ఘన సన్మానం
కర్నూలు హాస్పిటల్ , న్యూస్ నేడు :రాయలసీమ ప్రాంతంలో అత్యాధునిక న్యూరో చికిత్సలకు కేంద్రంగా మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు వేగంగా ఎదుగుతోంది. కర్నూలులో CME సందర్భంగా వచ్చిన నిమ్స్ హాస్పిటల్స్, హైదరాబాద్ న్యూరో సర్జరీ విభాగం ప్రొఫెసర్ & హెడ్, ( Head Of the Dept. & Professor) న్యూరో సర్జన్ డా. యెర్రమ్నేని వంశీ కృష్ణ ( Dr yerramneni Vamsi )డా. యెర్రమ్నేని వంశీ కృష్ణ మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలును సందర్శించారు. ఈ సందర్భంగా డా. వంశీ కృష్ణ ను మెడికవర్ హాస్పిటల్స్ న్యూరో సర్జన్ డా. విశ్వ మరియు హాస్పిటల్ హెడ్ మహేశ్వర్ రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డా. వంశీ కృష్ణ మాట్లాడుతూ “మొత్తం రాయలసీమ ప్రాంతంలో కదలికల రుగ్మతలు ( Movement Disorders ) వంటి క్లిష్టమైన న్యూరో సమస్యలకు చికిత్స అందించేందుకు మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు అత్యంత అనుకూలమైన కేంద్రంగా ఉంది. అత్యాధునిక పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యులు, సమగ్ర మౌలిక సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా నా శిష్యుడు డా. విశ్వ గారు న్యూరో సర్జరీ రంగంలో చూపుతున్న నైపుణ్యం ప్రశంసనీయం” అని పేర్కొన్నారు. అనంతరం మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు న్యూరో సర్జన్ డా. విశ్వ మాట్లాడుతూ “ప్రఖ్యాత న్యూరో నిపుణులు మా ఆసుపత్రిని సందర్శించి అభినందించడం మా వైద్య బృందానికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తోంది. రాయలసీమ ప్రజలకు క్లిష్టమైన న్యూరో చికిత్సలు కూడా స్థానికంగానే అందించడమే మా లక్ష్యం” అని తెలిపారు. ఈ సందర్భంగా హాస్పిటల్ హెడ్ శ్రీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. “మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు రాయలసీమ ప్రజలకు నాణ్యమైన, విశ్వసనీయ వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది. న్యూరో సర్జరీ వంటి అత్యంత క్లిష్ట విభాగాల్లో కూడా అత్యాధునిక చికిత్సలు అందించగల సామర్థ్యం మా ఆసుపత్రికి ఉంది” అని అన్నారు. కార్యక్రమంలో డా. శిరీష యారీడ ( అడిషనల్ ప్రొఫెసర్, న్యూరలజీ ) డా. వసుంధర S రంగన్ ( అసిస్టెంట్ ప్రొఫెసర్, న్యూరో సర్జరీ), నిమ్స్ హాస్పిటల్స్, హైదరాబాద్ పాల్గొన్నారు.


