రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన సయ్యద్ బాయా జీద్ ఉరుసు ఉత్సవాలు
1 min read

వేలాదిగా ప్రజల తరలివస్తారని అంచనా
కుల మతాలకతీతంగా దర్గా ప్రఖ్యాతిగాంచింది
నగర పాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రాష్ట్రవ్యాప్తంగా ఎంతో పేరు ఉన్న సయ్యద్ బాయాజీద్ మహాత్ములవారి దర్గాను ప్రజలందరూ సందర్శించి మహాత్ములవారి దీవెనలు పొందాలని నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు అన్నారు.ఏలూరు కోటదిబ్బ పై ఉన్న హజారత్ సయ్యద్ బాయాజీద్ మహాత్ముల వారి దర్గా వద్ద జరుగుతున్న ఉరుసు మహోత్సవాల్లో భాగంగా ముఖ్యమైన కవ్వాలి ప్రోగ్రాం రోజు శుక్రవారం నగర పాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉరుసు మహోత్సవాలు సందర్భంగా ఏలూరు కోటదిబ్బ పై ఉన్న సయ్యద్ బాజీ దర్గా దర్శించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు తరలి వస్తారన్నారు. అనారోగ్యంతో ఉన్నవారికి సయ్యద్ బాజీ వారి దర్గా నుండి తీసుకువెళ్ళి కట్టిన తావీదుతో ఆరోగ్యంగా ఉంటారని ప్రజల నమ్మకం అని ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. తొలుత దివ్యశ్రీ షేక్ ఇబ్రహీం కుమారులు ప్రభుత్వ ఖాజీ ఫేక్ హుస్సేన్, షేక్ షాబీర్ హుస్సేన్,షేక్ షబీర్ హుస్సేన్ ల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి ఎస్ ఎం ఆర్ పెదబాబు ద్వారా మహాత్ముల వారికి చాదర్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సబ్బన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


