పదో తరగతిలో 100% ఉత్తీర్ణతే లక్ష్యం : ఎంపిడిఓ శ్రీనివాసరావు
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని మండలంలోని పీఆర్ పల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు సందర్శించి, పదో తరగతి విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి తగిన సూచనలు, సలహాలు అందించారు.మార్చి 16 నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న చేస్తున్న 100 రోజుల యాక్షన్ ప్లాన్ను ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణతో పాటిస్తూ, చదువుపై పూర్తి దృష్టి సారించి 100 శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని ఎంపిడిఓ విద్యార్థులను ప్రోత్సహించారు.ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఇంజనీర్ , ఈ ఉన్నత పాఠశాలకు నోడల్ ఆఫీసర్గా పనిచేస్తూ, పదో తరగతి విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు.అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న “ముస్తాబు” కార్యక్రమంలో భాగంగా అందజేస్తున్న ముస్తాబు కిట్లను ఎంపిడిఓ , పంచాయతీరాజ్ ఇంజనీర్ ఈఇ ప్రభాకర్ రెడ్డి పాఠశాలకుఅందించారు .మండల విద్యాధికారులు వెంకటేశ్వర నాయక్, మహేశ్వర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులకుఈ కిట్లు పంపిణీ చేశారు. అదేవిధముగా ఈ ముస్తాబు కిట్లు గౌరవ జిల్లా కలెక్టర్ కూడా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు పంపిణీ చేశారు.అందుకు కూడా విద్యార్థులందరూ కూడా జిల్లా కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి, విద్యలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ముందడుగు పడిందని అధికారులు తెలిపారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

