NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉచిత EAP CET కరపత్రిక ఆవిష్కరణ..

1 min read

విజయ్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యం లో

మార్కాపురం, న్యూస్​ నేడు   : జిల్లా ఎర్రగొండపాలెం పట్టణమునందు విజయ్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ద్వితీయ సంవత్సరం ఉచిత EAP CET మరియు POLY CET కరపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఎంఈఓ   ఆఫీస్ ఆవరణంలో మండల విద్యాధికారి ఆంజనేయులు  చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఆయన మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు సెకండియర్ చదువుతున్న వారు ఈ ఉచిత కోచింగ్ సెంటర్లో చేరి అత్యధిక సీట్లు సంపాదించుకొనుటకు ఇదే సదవకాశం అని ఆయన అన్నారు స్వచ్ఛంద సంస్థలు విద్యాప్తి కోసం పాటుపడడం చాలా ఆనందంగా ఉందని విద్య ద్వారానే సామాజిక మార్పు వస్తుందని ఎంతటి పేదవాడైన విద్య ద్వారానే ఉన్నతుడు అవ్వచ్చని ఆయన అన్నారు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నా విద్యార్థిని విద్యార్థులు అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మీ లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చని ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు  ఈ  సంస్థ గత సంవత్సరం ఉచిత కోచింగ్ సెంటర్ పెట్టి అనేక మంది విద్యార్థినీ విద్యార్థులకు సీట్లు వచ్చే విధంగా కృషి చేసిందని ఆయన అన్నారు విద్య వైద్య సామాజికపరంగా వెనుకపడ్డ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో ముందుకొచ్చిన విజయ్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ సండ్రపాటి విజయ్ కుమార్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు విద్యావేత్తలు మేధావులు మానవతవాదులంతా సహకరించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పూర్ణ కంటి తిరుమలయ్య  దేవోసోత్తు మంత్రుల నాయక్ రాచుటి ప్రసాద్ ఎనుబెర అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author