సి సి కల్వర్టు సమస్య ను వెంటనే పరిష్కరించాలి: ఎస్డిపిఐ
1 min read

హోళగుంద న్యూస్ నేడు: ఈ.బి. సి. కాలనీ లో 3 వ లైన్ లో సి సి కాల్వట్ సమస్య ను వెంటనే పరిష్కరించాలని ఎస్డిపిఐ డిమాండ్ హొళగుంద గ్రామంలో ఈ బీసీ కాలనీ నందు కల్వర్టు సమస్య పరిష్కారానికి పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ నీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మన వార్డు మన బాధ్యత అనే నినాదంతో ఇంటింటి తిరిగి ఎస్డిపిఐ కార్యకర్తలు సర్వే నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా హొళగుంద మండలంలో ఈ బీసీ కాలనీ లో ఎస్డిపిఐ కార్యకర్తలు మన వార్డు మన బాధ్యత అనే నినాదంతో సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో ఈ బీసీ కాలనీ నాలుగో లైన్ లో బి టి అబ్దుల్లా ఇంటి పక్కన పెద్ద డ్రైనేజ్ ఉంది కానీ దానికి కల్వర్టు సౌకర్యం లేదు అందువలన ఆ లైన్ లో ఉండే ప్రజలకు చిన్న పిల్లలకు తిరగడానికి చాలా ఇబ్బందికరంగా మారింది అన్నారు వెంటనే కలవర్టు వేసి ఈ సమస్యను పరిష్కరించాలని ఎస్డిపిఐ వార్డ్ ఇంచార్జ్ లు భాష మరియు రహమతుల్లా వారి ఆధ్వర్యంలో ఎస్డిపిఐ కార్యకర్తలు మరియు కాలనీ వాసులు గ్రామపంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ ని వినతి పత్రం ద్వారా కోరడమైనది ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ ఇంచార్జ్ బాషా రహమతుల్లా నజీర్ నిసర్ సమిఉల్లా అసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

