NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాటు సారా స్థావరాలపై దాడులు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న బంగారు పేట కాలనీలో జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి యం సుధీర్ బాబు అధ్యక్షతన నాటు సారా స్థావరాలపై దాడులు చేయడం జరిగినది. నాటు సారా పునరుత్పాదన పై దృష్టి సారించి మూకుమ్మడిగా దాడులు నిర్వహించడం జరిగినది . ఈ దాడులలో సుమారు 90 లీటర్ల నాటు సారా తయారీకి ఉపయోగపడు బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగినది. తదుపరి కాలనీవాసులను ఉద్దేశించి జిల్లా ప్రొహిబిషన్  మరియు ఎక్సైజ్ అధికారి ఎం సుధీర్ బాబు నాటు సారా గురించి ఆరా తీయడం జరిగినది. బంగారుపేట వాసులు పూర్తిస్థాయిలో నాటు సారా కి దూరంగా ఉండడం మాకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల ద్వారా లబ్ధి జరుగుతుందని భావించి వాటిని పెంపుదల చేయమని వాటి ద్వారా మా జీవన విధానాన్ని మెరుగుపరుచుకుంటామని తెలియజేయడం జరిగినది . ఇప్పుడు కాలనీలో నాటు సారా చాలా వరకు పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టినది కావున మిగిలిన వారికి కూడా ఈ స్వయం ఉపాధి కల్పనా కార్యక్రమాల్లో అవకాశం కల్పించినట్లయితే నాటు సారా మరల పునరావృతం కాకుండా ఎవరి పనిలో వారు చక్కగా లీనమైపోతారు కావున మరి కొంతమందికి ఉపాధి చూపించగలరని గ్రామస్తులు అందరూ తెలియజేశారు. ఈ దాడులలో ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ రాజశేఖర్ గౌడ్ ఈ ఎస్ టి ఎఫ్ ఏఈఎస్ రామకృష్ణారెడ్డి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ విజయవాడ స్క్వాడ్ శ్రీహరి రెడ్డి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్  కర్నూలు చంద్రహాస్ ఈఎస్టిఎఫ్సిఐ రాజేంద్రప్రసాద్ మరియు సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.

About Author